Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

Advertiesment
asian games womens team
, సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:08 IST)
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టంచారు. ఈ క్రీడల్లో ఏకంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని మహిళా క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ఈ యేడాది జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు రెండు బంగారు పతకాలను చేసుకున్నట్టయిది. అలాగే, ఇప్పటివరకు అన్ని విభాగాల్లో కలిపి భారత ఆటగాళ్లు 11 పతకాలను కైవసం చేసుకున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత మహిళా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. జట్టులో స్మృతి మందనా 46, జెమీమా రోడ్రిగ్స్ 42 చొప్పున పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత 117 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 97 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు 4 ఓవర్లు వేసి ఆరు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. మరో బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా రెండు వికెట్లు తీసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన భారత్