Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ ది hero: రెండో టీ20లో భారత్ గెలుపు.. ప్రపంచ రికార్డు

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (12:19 IST)
నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ20లో ఆకాశమే హద్దుగా హిట్ మ్యాన్ చెలరేగాడు. ఫలితంగా రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించి సిరీస్‌ను 1-1గా సమం చేసింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత జట్టు 91 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో సిరీస్ ఫలితం హైదరాబాద్ మ్యాచ్‌కు బదిలీ అయింది.
 
పరుగులు రాబట్టడంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న స్కిప్పర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 20 బంతుల్లో  నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలతో విరుచుకుపడ్డాడు. క్రీజులో పాతుకుపోవాలని, ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బ్యాట్‌ను ఝళిపించడం మానుకోవాలని సూచించాడు. అలాగే, ఫీల్డింగ్ వైఫల్యాలు సరిదిద్దుకోవాలని సూచించాడు.
 
గత రాత్రి మ్యాచ్ అనంతరం అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. నాగ్‌పూర్ మ్యాచ్‌లో రోహిత్ చాలా సెలక్టివ్‌ షాట్లు ఆడాడని ప్రశంసించాడు. ఫ్లిక్‌షాట్లు, పుల్‌షాట్లను అద్భుతంగా ఆడాడని అన్నాడు. రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఇదే కారణమని విశ్లేషించాడు. 
 
ఇకపోతే.. రోహిత్ వీరవిహారంతో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగుల (8 ఓవర్లలోనే) లక్ష్యాన్ని టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సిక్సర్ల విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

తర్వాతి కథనం
Show comments