Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఝులన్ గోస్వామి అరుదైన రికార్డ్

Jhulan Goswami
, మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (19:13 IST)
Jhulan Goswami
ఇంగ్లండ్ మహిళలతో వన్డే సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. హోవ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
కాగా తన కెరీర్‌లో చివరి సిరీస్‌ ఆడుతున్న భారత భారత వెటరన్‌ పేసర్‌ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో గోస్వామి తన 10 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టింది. తద్వారా ఇంగ్లండ్‌ గడ్డపై ఇంగ్లీష్ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గోస్వామి రికార్డులకెక్కింది. 
 
అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ కేథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ (23 వికెట్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఝులన్(24 వికెట్లు) కేథరిన్ రికార్డురు బ్రేక్‌ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పల్ టీ20 మ్యాచ్ టిక్కెట్లన్నీ పేటీఎంలోనే విక్రయం : హెచ్ఏసీ