ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ క్రికెట్ ప్రేమికులకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు. ఫించ్ వన్డేలకు వీడ్కోలు చెప్పడానికి అతడి ఫామ్ కారణంగా తెలుస్తోంది. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో ఆడనున్న మూడో వన్డేనే ఫించ్‌కు ఆఖరి వన్డే మ్యాచ్ కానుంది.
"వన్డేల్లో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా లాంటి అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నా. నా ప్రయాణంలో ఎంతో మంది ఆటగాళ్లు అండగా నిలిచారు. నాకు మద్దుతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, అభిమానులు, ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని ఫించ్ అన్నాడు. ఇక వచ్చే వన్డే ప్రపంచకప్ కోసం కొత్త నాయకుడిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
వన్డేల నుంచి తప్పుకున్న ఫించ్ టీ20లకు మాత్రం కెప్టెన్‌గానే ఉండనున్నాడు. ఇప్పటి వరకు 145 వన్డేలు ఆడిన ఫించ్ 5,401 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.