Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్ విజేతగా ఎవరు నిలుస్తారంటే.. 'బాబా' జోస్యం

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (09:48 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 19వ తేదీన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టైటిల్ వార్ జరుగనుంది. దీంతో ఈ పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ దఫా టైటిల్ విజేతపై సూపర్ స్టార్ రజినీకాంత్ జోస్యం చెప్పారు. ఈసారి ఖచ్చితంగా భారత్ విజేతగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన పేసర్ మహ్మద్ షమీపై ఈ బాబా ప్రశంసల వర్షం కురిపించారు. 
 
వాంఖడే స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు రజనీకాంత్ సతీసమేతంగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం ఆయన చెన్నైకి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 'న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత కాసేపు టెన్షన్‌గా ఉన్నప్పటికీ ఒక్కో వికెట్ పడే కొద్దీ పరిస్థితి అనుకూలంగా మారింది. కానీ ఆ గంటన్నర సమయంలో మాత్రం చాలా టెన్షన్‌గా అనిపించింది. అయితే, ఈ సారీ ప్రపంచకప్ భారత్ అని నమ్మకంగా చెప్పగలను' అని రజనీకాంత్ అన్నారు.
 
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ : ప్రత్యేక అతిథిగా ప్రధాని మోడీ  
 
ఈ నెల 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీ భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో వీక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరుకానున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది.
 
అయితే, ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని చెబుతున్నారు. మోదీతో పాటు క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు హాజరుకానున్నారు. 
 
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ : అహ్మదాబాద్‌కు చేరుకున్న భారత క్రికెటర్లు 
 
ఈ నెల 19వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌‍లో జరుగనుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు అహ్మదాబాద్ నగరానికి చేరుకున్నాయి. గురువారం సాయంత్రం ముంబయి నుంచి బయల్దేరిన టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. 
 
విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు. టీమిండియా ఆటగాళ్లు వస్తున్నారని తెలియడంతో అహ్మదాబాద్‌లో ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. బస్సులో ఉన్న తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ ఆనందంతో నినాదాలు చేశారు. టీమిండియా ఆటగాళ్లు రేపటి నుంచి ప్రాక్టీసు చేయనున్నారు. ఇవాళ రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా జట్టు రేపు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

తర్వాతి కథనం
Show comments