Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : నేడు శ్రీలంక వర్సెస్ కివీస్... దేవుడా... లంకేయుల చేతిలో కివీస్ ఓడిపోవాలి

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (11:46 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలని భారత్ క్రికెటర్లు మాత్రమేకాదు.. యావత్ క్రికెట్ ప్రపంచం కోరుకుంటుంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆతిథ్య జట్టు భారత్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలించింది. తర్వాత స్థానాల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం సెమీస్‌కు పాకిస్థాన్ జట్టు వస్తుంది. అపుడు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మరోమారు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఈ పోరాటాన్ని కనులారా వీక్షించేందుకు వీలుగా లంకేయులు చేతిలో కివీస్ ఆటగాళ్లు ఓడిపోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌‍లో కివీస్ జట్టు గెలిస్తే సెమీస్‌కు చేరుతుంది. 
 
ఇదిలావుంటే, పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. 8 పాయింట్లతో సమానంగా ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల నుంచి ఓ జట్టుతో సెమీస్‌లో తలపడుతుంది. మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢీకొంటాయి. గురువారం శ్రీలంకపై విజయం సాధిస్తే న్యూజిలాండ్ (0.398) సెమీస్ చేరడం దాదాపుగా ఖాయం. ఎందుకంటే ఆ జట్టు రన్ రేట్ పాకిస్థాన్ (0.036), అప్ఘాన్ (-0.338) కంటే మెరుగ్గా ఉంది. ఒకవేళ శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా కివీస్‌కు అవకాశం ఉంటుంది. 
 
కానీ పాక్, ఆప్ఘాన్ తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఆప్ఘాన్ ముందుకు వెళ్లాలంటే దక్షిణాఫ్రికాపై నెగ్గాలి. పాక్, కివీస్ ఓడిపోవాలి. ఈ ముక్కోణపు రేసులో మిగతా రెండు జట్లతో పోలిస్తే పాకిస్థాన్ జట్టుకే కాస్త ప్రయోజనం ఉందనే చెప్పాలి. ఎందుకంటే కివీస్, ఆప్ఘాన్ మ్యాచ్‌ల తర్వాత పాక్ ఆడుతుంది. అప్పటికే సమీకరణాలపై పాక్‌కు పక్కాగా స్పష్టత వస్తుంది. ఒకవేళ నెట్ రన్ రేట్ పరిగణలోకి వస్తే ఎంత తేడాతో గెలవాలనేది కూడా ముందే తెలిసిపోతుంది.
 
ఈ టోర్నీలో పాకిస్థాన్ సెమీస్ చేరితే సెమీస్ వేదికలు మారనున్నాయి. నిజానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో వచ్చే బుధవారం వాంఖెడేలో సెమీస్ ఆడాల్సి ఉంది. కానీ ప్రత్యర్థిగా పాకిస్థాన్ వస్తే మాత్రం ఈ మ్యాచ్ ముంబైకి బదులు కోల్‌కతాలో జరుగుతుంది. షెడ్యూల్ ప్రకటించినప్పుడే ఐసీసీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మ్యాచ్‌ల కోసం ముంబై వెళ్లేందుకు పాకిస్థాన్ నిరాకరించడమే అందుకు కారణం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మరో సెమీస్ ముంబైలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments