Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగళూరు: పరుపు కింద నోట్ల కట్టలు.. రూ.42 కోట్లు స్వాధీనం

money
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (14:42 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.. ఐటీ అధికారులు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.42 కోట్ల నగదును పట్టుకున్నారు. ఓ ఇంట్లో పరుపు కింద దాచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్, ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో.. బెంగళూరులో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేపట్టింది. 
 
నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు. 
 
ఆర్టీ నగర్‌లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాటులో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెడ్ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం రూ.42 కోట్లని తేలింది. 
 
ఈ ఫ్లాట్ ఖాళీగా వుంది. ఆ మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ : పొన్నాల లక్ష్మయ్య రాజీనామా