Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (11:32 IST)
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కర్ణాటక ఎన్నికల సంఘం అంబాసిడర్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరకు ఆయనకే ఓటు లేకుండా పోయింది. దీనికి కారణం ఆయనతో పాటు.. ఆయన సోదరుడు చేసిన చిన్నతప్పిదమే. ఈ తప్పిదం కారణంగా రాహుల్ ద్రావిడ్‌కు చివరకు ఓటు హక్కే లేకుండా పోయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దేశ భవిష్యత్‌ను నిర్ధేశించేది ఓటు అని, 18 యేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అలా ప్రచారకర్తల్లో రాహుల్ ద్రావిడ్ కూడా ఒకరు. అయితే, ఆయన ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. 
 
గత కొన్ని సంవత్సరాలుగా ద్రావిడ్ బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని ఇందిరా నగర్‌లో ఉంటున్నారు. ఆ చిరునామాలోనే ద్రవిడ్‌కు ఓటు ఉంది. అయితే, ఇటీవల ఆయన తన ఇంటిని మార్చారు. మల్లేశ్వరంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి చేరుకున్నారు. ఈ ప్రాంతం బెంగుళూరు నార్త్‌ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇంటిని మార్చాడే కానీ, తన ఓటును మాత్రం మార్చుకోలేదు. 
 
అదేసమయంలో తన అన్న ఇల్లు మారాడని, అందువల్ల ఆయన పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాలని బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి దరఖాస్తు ద్రావిడ్ సోదరుడు సమర్పించాడు. దీంతో ఓటరు జాబితా నుంచి ద్రావిడ్ పేరును తొలగించారు. కానీ, కొత్త నియోజకవర్గంలో ఓటు నమోదు గడువు ముగిసే సమయానికి వెరిఫికేషన్ కోసం అధికారులు ఆయన ఇంటికి వెళ్లే సమయానికి ద్రావిడ్ విదేశాల్లో ఉన్నారు. దీంతో ద్రావిడ్ పేరు కొత్త నియోజకవర్గంలో తయారు చేసిన ఓటరు జాబితాలో లేకుండా పోయింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తూ ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం చేసే రాహుల్ ద్రావిడ్‌కు చివరకు అతనికే ఓటు లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments