Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో వెల్లువెత్తిన ఓటరు.. 80 శాతం ఓటింగ్.. ద్వివేదీ

ఆంధ్రప్రదేశ్‌లో వెల్లువెత్తిన ఓటరు.. 80 శాతం ఓటింగ్.. ద్వివేదీ
, శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటరన్న పోలింగ్ కేంద్రానికి క్యూ కట్టారు. ఫలితంగా 80 పైచిలుకు ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. అయితే, ఎన్నికలకు సరైన భద్రత కల్పించలేక పోయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. తగినంత భద్రతా బలగాలు కావాలని తాను, కలెక్టర్లు, ఎస్పీలు కోరినా ఎన్నికల సంఘం స్పందించలేదని ఆయన వాపోయారు. అందువల్లే హింసాత్మక సంఘటనలు, హత్యలు జరిగి పోలింగ్‌ను ప్రభావితం చేశాయన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల సమయంలో భాగంగా, 'తాడిపత్రి, పూతలపట్టు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనల ప్రభావం పోలింగ్‌పై పడింది. తాడిపత్రిలో టీడీపీ సానుభూతిపరుడి హత్య జరిగిన తర్వాత అక్కడ పోలింగ్‌ మందగించింది. చిత్తూరులోని ఒక కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ఆపాల్సి వచ్చింది. రాష్ట్రంలో మొత్తంగా 25 చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఒకరు, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో మరొకరు చనిపోయారు. రెండువర్గాల మధ్య కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడాలు, భౌతిక దాడులు జరిగాయి. ఘర్షణలు జరిగిన పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంల మొరాయింపువల్ల పోలింగ్‌ ఆసల్యమైన చోట రీపోలింగ్‌ నిర్వహించే ప్రతిపాదనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం' అని చెప్పారు. 
 
'సిబ్బందికి అనేకసార్లు శిక్షణనిచ్చినప్పటికీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకుంటాం. ఐదేళ్లకొకసారి వేసే ఓటును ఓటరు సద్వినియోగం చేసుకోవడానికి తలెత్తిన అడ్డంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంది. మొత్తం 381 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 6 చోట్ల మాక్‌పోల్‌ ఓట్లను తొలగించకుండానే ఓటింగ్‌ కొనసాగించారు. ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసం జరిగింది. మాక్‌పోలింగ్‌ సమయంలోనే కొన్ని ఈవీఎంలను మార్చాం. మరికొన్ని ఈవీఎంలను పోలింగ్‌ జరుగుతుండగా మార్చాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో ఈవీఎంలు మరమ్మతు చేయకపోవడం వల్ల కూడా ఉదయం పూట ఓటర్లకు సమయం వృథా అయింది. చాలాచోట్ల ఓటర్లు గంటలకొద్ది క్యూలో నిలబడాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనియా చేతిలో రూ.60 వేల నగదు... చేబదులుగా రూ.5 లక్షల రుణం