Publish Date: Thu, 11 Apr 2019 (13:34 IST)
Updated Date: Thu, 11 Apr 2019 (13:35 IST)
ఏపీ ఎన్నికల్లో కొన్నిచోట్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో తెదేపా-వైకాపా మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తెదేపాకి చెందినవారు కాగా మరొకరు వైసీపికి చెందినవారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది బరిలో వున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకి ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం... 11 గంటలకు 23.22 శాతం పోలింగ నమోదైంది.
అత్యధికంగా విజయనగరం జిల్లాలో 31.57 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 27.5 శాతం నమోదైంది. ఇక మిగిలిన జిల్లాల్లో చూస్తే.. శ్రీకాకుళం 19.78%, విశాఖపట్నం 21.64 %, పశ్చిమగోదావరి 20.41%, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23%, కడప 17.84 %, అనంతపురం 21.47% శాతంగా నమోదైంది.