Webdunia - Bharat's app for daily news and videos

Install App

థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నీ: ప్రణయ్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (10:26 IST)
ప్రతిష్టాత్మిక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ మరోసారి సంచలన ప్రదర్శన చేశాడు. భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన కంటే ఎంతో మెరుగైన, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ను ఓడిస్తూ మలేషియా ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 
 
మరోవైపు డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఇదే టోర్నమెంట్‌లో అతి కష్టం మ్మీద ప్రీక్వార్టర్స్‌ అధిగమించింది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో అన్ సీడెడ్ ఆటగాడైన ప్రణయ్‌ 21-15, 21-7తో నాలుగో ర్యాంకర్ చో టిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ను వరుస గేముల్లో చిత్తు చేసి ఔరా అనిపించాడు. క్వార్టర్ ఫైనల్లో అతను ఏడోసీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో తలపడతాడు. 
 
మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 9-21, 21-9,21-14తో చైవాన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. దాదాపు గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత వరుస గేమ్‌లు నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments