Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సారథ్యంలో గెలిచిన టీ20 ప్రపంచ కప్‌కు 14 వసంతాలు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (13:04 IST)
సరిగ్గా 14 యేళ్ళ క్రితం సెప్టెంబరు 24వ తేదీన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుని కోట్లాది మంది భారతీయులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించి ప్రారంభ పొట్టి క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. 
 
సెప్టెంబర్ 24, 2007న భారత్ క్రికెట్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 1983 ప్రపంచ కప్ విజయం తర్వాత మెన్ ఇన్ బ్లూ యొక్క మొట్టమొదటి ప్రధాన పరిమిత ఓవర్ల ట్రోఫీగా 2007 ప్రపంచ ట్వంటీ 20 విజయం కూడా ఒక ముఖ్యమైనది. 
 
తొలుత ఆస్ట్రేలియాను 15 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఆ తర్వాత ఫైనల్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ఫలితంగా విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గౌతం గంభీర్ 77 బంతుల్లో 55 రన్స్ చేయగా, రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 20 ఓవర్లలో భారత్ 157 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌కు 13 పరుగులు కావాల్సిన తరుణంలో పాక్ ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడికిలోనై మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. చివరి ఓవర్ భారత బౌలర్ జోగిందర్ శర్మతో వేయించిన కెప్టెన్ ధోనీ భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments