ధోనీలో మరో కోణం ఉంది.. నోరు తెరిస్తే పచ్చి బూతులే.. ఇషాంత్ శర్మ

Webdunia
గురువారం, 6 జులై 2023 (08:52 IST)
మిస్టర్ కూల్‌గా గుర్తింపు పొందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నంతగా ధోనీ శాంతస్వభావి కాదని, నోరు తెరిస్తే పచ్చి బూతులే వస్తాయంటా భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీతో తాను కూడా తిట్లు తిన్నానని చెప్పాడు. పైగా, ధోనీ జాబితాలో కామ్ అండ్ కూల్‌ లేవని వ్యాఖ్యానించారు.
 
ఇదేవిషయంపై ఇషాంత్ శర్మ స్పందిస్తూ, ధోనీకి ఎన్నో బలాలున్నా కామ్ అండ్ కూల్ మాత్రం ఆ జాబితాలో లేవని తెలిపాడు. మైదానంలో ఆటగాళ్లను బూతులు తిడుతుంటాడని, తాను వినడమే కాకుండా అతడితో తిట్లు కూడా తిన్నానని చెప్పుకొచ్చాడు. తానోసారి బౌలింగ్ పూర్తిచేశాక ధోనీ తన వద్దకు వచ్చి నువ్వు అలసిపోయావా? అని అడిగాడని దానికి తాను ఔను అని సమాధానమిస్తే వయసైపోయింది.. రిటైర్ అయిపోమని సలహా ఇచ్చాడని గుర్తు చేసాడు. 
 
ఒకసారి మహీబాయ్ విసిరిస త్రోను తాను అందులేకపోయినందుకు తనపై కోపంగా చూశాడని, రెండోసారి బలంగా విసిరిన త్రోను కూడా పట్టుకోలేకపోయానని పేర్కొన్నాడు. మూడోసారి వేసేటపుడు మాత్రం ఈసారి తలబాదుకో అని గట్టిగా అరిచాడంటూ ధోనీ కోపం గురించి ఇషాంత్ శర్మ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

3 కోట్ల ఐఆర్‌సీటీసీ ఖాతాలు డీయాక్టివేట్ చేసిన రైల్వే శాఖ

హిందూయేతర ఉద్యోగుల సమస్యను టీటీడీనే స్వయంగా పరిష్కరించుకోవాలి

ఐఫాతో తెలంగాణ ప్రభుత్వం కీలక బహుళ-వార్షిక ప్రపంచ స్థాయి భాగస్వామ్యం

వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని కదల్చలేరు.. మంత్రి పెమ్మసాని

బీజేపీకి సరెండర్ కావాలనుకుంటున్న వైకాపా.. కౌంటరిచ్చిన ప్రధాన మంత్రి మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

తర్వాతి కథనం
Show comments