శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం వచ్చిందంటే నమ్ముతారా.. నమ్మాల్సిందే. ఎయిర్ పోర్టుల్లో తెల్లటి యూనిఫాంతో పనిచేసే ఉద్యోగుల మధ్య నెత్తిన టోపీ, యూనిఫాంతో ఓ పిల్లి కనిపిస్తోంది. ఆ పిల్లి పేరు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్.
ఆ ఎయిర్ పోర్టులో మిగతా ఉద్యోగుల తరహాలోనే సదరు పిల్లి కూడా ఓ ఉద్యోగి. ఈ ఉద్యోగికి అందరూ సరైన గౌరవం ఇస్తారు. మొదటిసారి విమాన ప్రయాణం చేసే ఉద్యోగుల్లో భయం తగ్గించేందుకు గాను ఈ పిల్లిని నియమించారట.
ఈ పిల్లితో కాసేపు గడిపితే ప్రయాణం గురించిన టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఆపై భయపడకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నెర్వస్ ను పోగొట్టేందుకు ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని వివరించారు.