Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో జాతీయ జెండా: లడఖ్‌లో ధోనీ పతాకావిష్కరణ (Video)

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:37 IST)
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్‌లో ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగురనుంది. జమ్మూ-కాశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ లడఖ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండడం విశేషం. ఇందులో భాగంగా శనివారం ధోని లేహ్ నుంచి లడఖ్‌కు బయల్దేరాడు. అయితే, లడఖ్‌లో ధోనీ జెండా ఎగురువేసే వేదికను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
 
కాగా ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ భారత ఆర్మీలో దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న 106 టిఎ బెటాలియన్ (పారా)లో విధులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని కశ్మీర్‌లో పారామిలటరీ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో తోటి సైనికులతో చాలా చక్కగా కలిసిపోతున్నాడు.
 
ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో ధోనీ విధులు నిర్వర్తిస్తున్నాడు. తన విధుల్లో భాగంగా ధోనీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు లడఖ్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జమ్మూ కాశ్మీర్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అకాడమీ ద్వారా అక్కడి యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ధోనీ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖతో ధోనీ మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments