Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లడఖ్ ఎంపీ ప్రసంగానికి దేశం ఫిదా... 5 వేలు దాటిన ఎఫ్.బి ఫాలోవర్లు

Advertiesment
లడఖ్ ఎంపీ ప్రసంగానికి దేశం ఫిదా... 5 వేలు దాటిన ఎఫ్.బి ఫాలోవర్లు
, గురువారం, 8 ఆగస్టు 2019 (09:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇదే అంశంపై లోక్‌సభలో సుధీర్ఘ చర్చ జరిగింది. 
 
ఈ సందర్భంగా లడఖ్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికై యువ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నమ్‌గ్యాల్ చేసిన ప్రసంగం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అంతే.. ఆయన ప్రసంగం విన్న యువత జేజేలు పలుకుతోంది. 
 
ముఖ్యంగా, ఈ యువ ఎంపీ తన ప్రసంగంలో లడఖ్ కష్టాలను ఏకరవు పెట్టాడు. ఈ ఒక్క ప్రసంగంతో దేశ దృష్టిని ఆకర్షించాడు. సభలో ఆయన చేసిన ప్రసంగంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు పెరిగిపోయారు. ఆయన ఫేస్‌బుక్ ఖాతా అయితే ఫ్రెండ్ రిక్వెస్టులతో పోటెత్తుతోంది. దీంతో బీజేపీ ఎంపీ స్పందించారు.
 
కేంద్రపాలిత ప్రాంతం కోసం లడఖ్ ప్రజలు ఏడు దశాబ్దాలుగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. లడఖ్‌ అభివృద్ధికి నోచుకోకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అలాగే, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను కూడా తన ప్రసంగంలో తూర్పారబట్టారు. ఆయన ప్రసంగానికి దేశం మొత్తం ఫిదా అయింది.
 
అంతేనా, ఆయన ఫేస్‌బుక్ ఫాలోయర్ల సంఖ్య ఐదు వేలకు దాటిపోయింది. అందువల్ల ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పంపించే రిక్వెస్టులను తానిక యాక్సెప్ట్ చేయలేనని, ఇప్పటికే ఆ సంఖ్య 5 వేలకు దాటిపోయిందంటూ వ్యాఖ్యానించారు. కాబట్టి తన అధికారిక పేజీని విజిట్ చేస్తూ, లైకులతో సరిపెట్టుకోవాలని సలహా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైకోర్టులో శివాజీకి ఊరట: లుకౌట్ నోటీసులు తొలగింపునకు గ్రీన్ సిగ్నల్