Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ రిటైర్మెంట్‌పై దివాకర్ ఏమన్నాడు..?

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:42 IST)
కరోనా వైరస్ కరోనా దెబ్బతో ఐపీఎల్‌ వాయిదా పడటం, ఈ నేపథ్యంలోనే ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు రావడం అతని అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. కాగా, ఈ విషయంపై ధోనీ మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ తాజాగా ఓ స్పష్టత ఇచ్చాడు. 
 
మహీకి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ఆలోచనలు లేవన్నాడు. 'మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం కాబట్టి తన క్రికెట్‌ గురించి మాట్లాడుకోం. కానీ, ధోనీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఒక విషయం చెబుతున్నా.. తనకి రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఎటువంటి ఆలోచనలు లేవు. ఐపీఎల్‌ ఆడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. లాక్‌డౌన్‌ కంటే ఒక నెల ముందే చెన్నైలో సాధన మొదలుపెట్టాడు' అని దివాకర్‌ గుర్తుచేశాడు. 
 
ఇక లాక్‌డౌన్‌ సమయంలోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ తన ఫామ్‌హౌజ్‌లోనే ఫిట్‌నెస్‌ కాపాడుకున్నాడని, పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తేశాక సాధన మొదలుపెడతాడని ధోనీ మేనేజర్‌ స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగి సాధారణ రావడంపై ఇది ఆధారపడిందని తెలిపారు. 
 
కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఐపీఎల్‌ నిర్వహణలో జాప్యం చోటు చేసుకొంది. మరోవైపు ఈ టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ బుధవారం మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్‌ లేకుండా 2020ని ముగించబోమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments