Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పిన కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్.. బ్రావో హెలికాప్టర్‌ సాంగ్ (Video)

Advertiesment
Watch
, మంగళవారం, 7 జులై 2020 (11:49 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ధోనీకి శుభాకాంక్షలు చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అలాగే ధోనీ సహచరులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
మహీ భాయ్ హ్యాపీబర్త్‌డే అంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రీటింగ్స్ తెలిపారు. తన ట్విట్టర్‌లో ధోనీతో దిగిన కొన్ని ఫోటోలను కోహ్లీ ట్వీట్ చేశాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంతో ఉండాలంటూ కోహ్లీ ఆకాంక్షించాడు. ధోనీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు కనిపించాలంటూ కోహ్లీ తన ట్వీట్‌లో దేవున్ని ప్రార్థించాడు.
 
బీసీసీఐ, ఐసీసీ కూడా మిస్టర్ కూల్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి. 39వ పడిలోకి అడుగుపెట్టిన ధోనీకి.. మాజీ క్రికెటర్ వీరూ కూడా విషెస్ తెలిపారు. తరానికి ఓ ప్లేయర్ వస్తాడని, దేశం ఆ ప్లేయర్‌తో ఏకం అవుతుందని, అతని కుటుంబంలో సభ్యుడినైనందుకు థ్యాంక్స్ అంటూ వీరూ ట్వీట్ చేశాడు.
 
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌ మహీ కోసం ఓ కొత్త పాటను వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రూపొందించాడు. ఇవాళ ధోనీ జన్మదినం సందర్భంగా ''హెలికాప్టర్‌ సాంగ్‌" ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో రిలీజ్ చేశాడు. ధోనీ సాంగ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
 
Dhoni
బ్రావో ఓ గొప్ప ఆల్‌రౌండర్‌ మాత్రమే కాదు.. మంచి గాయకుడు కూడా. తనే స్వయంగా పాటు రాసి వీడియోలు రూపొందిస్తాడు. ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు. గతంలో అతడు రూపొందించిన డీజే..ఛాంపియన్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. 2019 జూలై 9న ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ధోనీ తన ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటికి ఏడాదవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి : శ్రీలంక క్రికెటర్ అరెస్టు