Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరు నిర్ణయించుకున్నారు.. నేను కాదు.. ధోనీ

Webdunia
బుధవారం, 3 మే 2023 (19:01 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌పై గత కొన్ని రోజులుగా వివిధ రకాలైన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదే అతడికి చివరి ఐపీఎల్‌ అంటూ ప్రతి సీజన్‌కు ముందు వార్తలు రావడం.. దానిపై పలువురు వివిధ రకాలుగా స్పందించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా లక్నోతో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ సందర్భంగా ధోనీ తన రిటైర్మెంట్‌ వార్తలపై మరోసారి స్పందించాడు.
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా 'మీ చివరి సీజన్‌ను ఆస్వాదిస్తున్నారా?' అని కామెంటేటర్‌ ధోనీని ప్రశ్నించాడు. దీనికి మహీ స్పందిస్తూ.. 'ఇది నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరు నిర్ణయించుకున్నారు.. నేను కాదు' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. 
 
అనంతరం కామెంటేటర్‌.. స్టేడియంలో ధోనీ కోసం భారీగా వచ్చిన ప్రేక్షకులను చూపిస్తూ.. 'మహీ వచ్చే ఏడాది కూడా ఆడేందుకు వస్తాడు' అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో జోష్‌ నింపాయి.
 
ఇటీవల ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ తన ఫేర్‌వెల్‌పై సరదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా సొంత మైదానం అయినప్పటికీ.. భారీగా అభిమానులు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కేకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్‌ అనంతరం ధోనీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు వీరంతా సీఎస్‌కే జెర్సీలో వచ్చినట్లుందని నవ్వుతూ అన్నాడు.
 
ఇక చెన్నై ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. నేడు లక్నోపై నెగ్గితే 12 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments