Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను సోదరుడుతో అత్యాచారం చేయిస్తానా? : క్రికెటర్ షమీ

తన సోదరుడితో తన భార్యపై అత్యాచారం చేయించానని వచ్చిన ఆరోపణలపై క్రికెటర్ మహ్మద్ షమీ స్పందించారు. ఈ ఆరోపణలన్నీ సత్యదూరమన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల అనేక జీవితాలో నాశనమైపోతాయని వాపోయాడు.

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (17:25 IST)
తన సోదరుడితో తన భార్యపై అత్యాచారం చేయించానని వచ్చిన ఆరోపణలపై క్రికెటర్ మహ్మద్ షమీ స్పందించారు. ఈ ఆరోపణలన్నీ సత్యదూరమన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల అనేక జీవితాలో నాశనమైపోతాయని వాపోయాడు. అందువల్ల ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ జరపాలని ఆయన ప్రాధేయపడ్డాడు. 
 
కాగా, తనపై తన భర్త సోదరుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడిని గదిలోకి పంపి... బయట షమీ తాళం వేశాడని, తాను గొడవ చేస్తే మళ్లీ తలుపు తీశాడని ఆమె ఆరోపించారు.
 
ఈ ఆరోపణలపై షమీ స్పందిస్తూ, అత్యాచారయత్నం జరిగిందంటూ హసీన్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. హసీన్ చెబుతున్నట్టు డిసెంబర్ 7వ తేదీన తన సోదరుడు ఇక్కడ లేడని... ముర్దాబాద్‌లో ఉన్నాడన్నాడు. తాను కూడా డిసెంబర్ 2 నుంచి 6 వరకు టెస్ట్ మ్యాచ్ ఆడానని... ఆ తర్వాత భువనేశ్వర్ రిసెప్షన్‌కు తన భార్యతో కలసి హాజరయ్యానని తెలిపాడు. 
 
డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు తమ స్వస్థలానికి వెళ్లామని చెప్పాడు. ఇలాంటప్పుడు ఆమెపై తన సోదరుడు అత్యాచారయత్నం చేయడం ఎలా సంభవమని ప్రశ్నించాడు. హసీన్ కేసుతో చాలా జీవితాలు ముడిపడి ఉన్నాయని... పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని, విచారణను పూర్తి చేయాలని కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments