Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్‌దేవ్ సరసన మహ్మద్ సిరాజ్! 39 యేళ్ల నాటి రికార్డు సమం

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (20:02 IST)
హర్యానా హరికేన్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సరసన భారత క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ సిరాజ్ చేరారు. తద్వారా 39 యేళ్లనాటి రికార్డును సమం చేశారు. క్రికెట్ మక్కాగా ప్రసిద్ధిగాంచిన ఇంగ్లండ్‌లో లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఈ అరుదైన రికార్డును సిరాజ్ నెలకొల్పారు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ సంచలన విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు చొప్పున మొత్తం 8 వికెట్లు తీశారు. మొత్తం 126 పరుగులు ఇచ్చాడు. 
 
39 యేళ్ళ క్రితం కపిల్ దేవ్ ఇదేవిధంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీసి 168 పరుగులు ఇచ్చాడు. అలాగే, 2007లో ఆర్పీ సింగ్ ఏడు వికెట్లు తీసి 117 పరుగులు ఇచ్చాడు. 1996లో వెంకటేష్ ప్రసాద్ ఏడు వికెట్లు తీసి 130 రన్స్ ఇచ్చాడు. 2014లో ఇషాంత్ శర్మ ఏడు వికెట్లు 135 పరుగులు ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments