Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ క్రికెట్‌కు మిచెల్ జాన్సన్ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ పేస్‌ బౌలర్ మిచెల్ జాన్సన్‌ గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్క

Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (14:49 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ పేస్‌ బౌలర్ మిచెల్ జాన్సన్‌ గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్‌ ప్లేయర్‌ ఇప్పటివరకు కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఇకపై టీ20 లీగ్‌ల్లో సైతం ఆడబోనని స్పష్టం చేశారు.
 
ఇదే అంశంపై జాన్సన్ స్పందిస్తూ, 'ఇక నా క్రికెట్‌ కెరీర్‌ అయిపోయింది. నేను నా చివరి బంతి వేసాను. చివరి వికెట్‌ను కూడా తీసుకున్నాను. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ రోజు (ఆదివారం) ప్రకటిస్తున్నా. నేనింకా కొన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతానని భావించాను. కానీ నాశరీరం అందుకు సహకరించడం లేదు. పూర్తిగా అలసిపోయాను. ఈ యేడాది ఐపీఎల్‌లో నాకు కలిగిన వెన్ను నొప్పి ఆటను ముగించాలని నన్ను హెచ్చిరించింది. దీంతో నా క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. మిగిలిన నా జీవితాన్ని ఆస్వాదిస్తాను' అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. 
 
జాన్సన్ తన కెరీర్‌లో 73 టెస్టుల్లో 313, వన్డేల్లో 153 మ్యాచుల్లో 239, టీ20ల్లో 38 వికెట్లను జాన్స‌న్ పడగొట్టాడు. ఆసీస్ త‌ర‌పున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాన్సన్‌ 2015లో త‌న చివ‌రి టెస్టు, వ‌న్డేను ఆడాడు. కాగా, ఈ ఆసీస్‌ ప్లేయర్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

తర్వాతి కథనం
Show comments