వన్డే ప్రపంచ కప్ : ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఐసీసీ
ఇంగ్లండ్, వేల్స్‌లో వచ్చే యేడాది మే 30వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసి
ఇంగ్లండ్, వేల్స్‌లో వచ్చే యేడాది మే 30వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ పాట క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో ముందుగా ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చేస్తోందంటూ ఫ్లింటాఫ్ వ్యాఖ్యానిస్తాడు. ఆపై విజిల్ వేస్తూ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ పాటను అందుకుంటాడు. దీంతో ఫ్లింటాప్ వద్దకు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్ చేరుకుని సందడి చేస్తారు.
ఈ సందర్భంగా వేర్వేరు దేశాలకు చెందిన జెండాలతో అభిమానులు డ్యాన్స్ చేస్తూ వీధుల్లో తీసుకెళ్తుంటే.. వీరిని చాలామంది ఫాలో అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌తో పాటు 14 దేశాలు పోటీపడనున్నాయి.