ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : భారత్ ముంగిట 273 రన్స్ టార్గెట్

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (18:22 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు అహ్వానించింది. దీంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 273 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో మిచెల్ 130, రచిన రవీంద్ర 75 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలించారు. వీరిద్దరూ జట్టు ఇన్నింగ్స్‌ను పునర్మించారు. 
 
19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ జట్టును రవీంద్ర - మిచెల్ జోడీ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. ఫలితంగా మూడో వికెట్‌ను కివీస్ జట్టు 178 పరుగుల వద్ద కోల్పోయింది. కివీస్ జట్టులో మిగిలిన ఆటగాళ్లలో కాన్వే, హెన్రీలు డకౌట్‌ కాగా, యంగ్ 17, లాథమ్ 5, ఫిలిప్స్ 23, చాంపన్ 6, సత్నర్ 1, ఫెర్గ్యూసన్‌లు 1 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, బుమ్రాలు ఒక్కో వికెట్ తీశారు. 
 
ఇదిలావుంటే, ప్రపంచ కప్‌లో భారత తరపున అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో మహ్మద్ షమీ మూడో స్థానంలో నిలిచాడు. ధర్మశాల వేదికగా జరిగిన కివీస్ మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్రపంచ కప్‌లో షమీ తీసిన వికెట్ల సంఖ్య 32కు చేరింది. తద్వారా భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 31 వికెట్ల ఫీట్‌ను అధికమించాడు. ఈ జాబితాలో జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ తలా 44 చొప్పున వికెట్లు తీశారు. ఇపుడు వీరిద్దరి తర్వాత షమీ చేఱాడు. జస్ప్రీత్ బుమ్రా 28 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments