Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : కివీస్‌తో మ్యాచ్ - టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (14:38 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీకి చోటు కల్పించారు. అలాగే, చీలమండ గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు. 
 
అయితే, ఈ ప్రపంచ కప్ కోసం భారత్ ప్రతి మ్యాచ్‌లోనూ శార్దూల్ ఠాకూర్‌ను ఆడిస్తుండటం విమర్శల చెలరేగుతున్నాయి. దీంతో అతన్ని తప్పించి షమీని తుది జట్టులోకి తీసుకున్నాడు. అటు కివీస్ జట్టులో మార్పులేమీ చేయలేదు. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత్, కివీస్ జట్లూ చెరో 4 మ్యాచ్‌లలో గెలుపొంది ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ అమితాసక్తి నెలకొంది. పైగా, ఈ రెండు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో హోరాహోరీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కాగా, టాస్ ఓడి ఫీల్డింగ్ ప్రారంభించిన కివీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద ఉండగా, ఓపెనర్ కాన్వే వికెట్‌ను కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అయ్యర్ క్యాచ్ పట్టడంతో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ జట్టు స్కోరు 7.4 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ఓపెనర్ యంగ్ 16, రవీంద్ర 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరంలోని గోడౌన్‌లో రూ.2.46 కోట్ల సిగరెట్లు స్వాధీనం

కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)

పెద్దిరెడ్డి ఇలాకాలో జారుకుంటున్న వైకాపా నేతలు.. టీడీపీలో చేరేందుకు సిద్ధం!!

పాము గొంతులో దగ్గు సిరప్ బాటిల్.. కాపాడిన టీమ్‌కు ప్రశంసలు

వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌పై ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

తర్వాతి కథనం
Show comments