Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక.. ఆగస్టు 15 తర్వాతేనా?

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:37 IST)
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్‌ కోచ్‌ ఎంపిక ఇంకాస్త ఆలస్యం కానుంది. మొదట్లో ఈ నెల 13, 14లో ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని భావించినా, ఇందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తి కాలేదు. దీంతో ఇండిపెండెన్స్‌ డే (ఆగస్టు 15) తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని బౌలింగ్‌ లెజెండ్‌ కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామితో కూడిన కమిటీ తెలిపింది.
 
అయితే దీనికి సంబంధించి కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా.. ఒకే రోజులో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నాయి. చీఫ్‌ కోచ్‌ కోసం ఆరు మందిని షార్ట్‌ లిస్ట్‌ చేసినట్లు సమాచారం. 
 
''కపిల్‌ కమిటీ టాప్‌–3ని ఎంపిక చేస్తుంది. ఇందులో నెంబర్‌వన్‌లో ఉన్న వారితో బీసీసీఐ మాట్లాడుతుంది. అతను అన్ని నిబంధనలకు ఓకే చెబితే కోచ్‌గా బాధ్యతలు అప్పగిస్తుంది'' అని బోర్డు వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో మాజీ ప్లేయర్లు విక్రమ్‌ రాథోర్‌, ప్రవీణ్‌ ఆమ్రే ముందున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments