Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీటర్ కాదు... సరైనోడు... అరుదైన ఫీట్‌ సాధించిన స్టీవ్ స్మిత్ (video)

Advertiesment
Steve Smith
, మంగళవారం, 6 ఆగస్టు 2019 (14:33 IST)
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను గతంలో ప్రతి ఒక్కరూ చీటర్ చీటర్ అంటూ ఎగతాళి చేశారు. కానీ, అతను మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి, ఇపుడు అందరినోటా శభాష్ అనిపించుకుంటున్నాడు. 
 
తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ సాధించాడు. పైగా, అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 25 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో సర్ బ్రాడ్‌మెన్ తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌లలో 25వ టెస్ట్ సెంచరీ సాధించిన ఘనతను దక్కించుకున్నాడు. అదేసమయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. ఇప్పటి వరకు రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 142 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలకపాత్రను పోషించాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నిం‍గ్స్‌ల్లో సెంచరీతో పాటు హాఫ్‌ సెంచరీ పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వస్‌ కల్లిస్‌ సరసన చేరిపోయాడు. 
 
గతంలో ఒక టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో పాటు హాఫ్‌ సెంచరీలను కల్లిస్‌ తొమ్మిది సందర్భాల్లో చేశాడు. ఇప్పడు స్మిత్‌ సైతం కల్లిస్‌ రికార్డును చేరుకున్నాడు. ఇందుకు బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ వేదికైంది. 
 
ఈ జాబితాలో అలెస్టర్‌ కుక్‌(ఇంగ్లండ్‌) ఎనిమిది సందర్భాల్లో ఆ మార్కును చేరి రెండో స్థానంలో కొనసాగుతుండగా, అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా), విరాట్‌ కోహ్లి(భారత్‌), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా), కుమార సంగక్కర(శ్రీలంక), సచిన్‌ టెండూల్కర్‌(భారత్‌)లు ఏడేసి సార్లు ఆ ఫీట్‌ సాధించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. మరొక టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ సెంచరీ, హాఫ్‌ సెంచరీలను సాధిస్తే కల్లిస్‌ రికార్డును అధికమిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. టీ-20 సిరీస్ నెగ్గిన టీమిండియా