Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక దేశంలో మరో క్రికెట్ సందడి - 22 నుంచి ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (09:16 IST)
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ముగిసింది. ఇకపై అత్యంత సంపన్న క్రీడగా పరిగణించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ సందడి మొదలుకానుంది. ఈ నెల 22వ తేదీన ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభంకానుంది. ఈ టోర్నీ మార్చి 22వ తేదీ నుంచి మే నెల 25 తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్య సూచనలు చేసింది. 
 
ఐపీఎల్‌లో పొగాకు, మద్యం ప్రకటనలు ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది. టోర్నీలో మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించాలని కేంద్ర వైద్య శాఖ సూచన చేసింది. దీంతో కేంద్ర హోం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కాగా, ఐపీఎల్ 18వ సీజన్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్స్ ఛాలెంజర్స్ జట్ల మధ్య కోల్‌కతాలో ప్రారంభం మ్యాచ్ జరుగనుంది. 
 
రిటైర్మెంట్ వార్తలు ఇక రాయొద్దు.. ప్లీజ్ : రోహిత్ శర్మ 
 
తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టారు. తాను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదని, అలాంటి ఉద్దేశం కూడా తనకు లేదని చెప్పారు. అందువల్ల తన రిటైర్మెంట్ వార్తలను ఇకపై రాయొద్దని మీడియాను కోరారు. 
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసిన భారత్.. 12 యేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడారు. 
 
తన భవిష్యత్‌కు సంబంధించిన ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. అందువల్ల రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు. వన్డే ఫార్మెట్ నుంచి తాను ఇపుడే రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. సుధీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందని, అయితే, ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందన్నారు. 
 
ఇకపోతే, చాంపియన్స్ ట్రోఫీని మళ్లీ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ టోర్నీ మొత్తం తామంతా ఒక జట్టుగా బాగా ఆడినట్టు చెప్పారు. జట్టు తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. 2023 ప్రపంచ కప్ సమయంలో రాహుల్ ద్రవిడ్‌తో ఇపుడు గౌతం గంభీర్‌తో మాట్లాడానని అన్నాడు.
 
ఆదివారం నాటి మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్ల పాటు ఎలా ఆడాలో పూర్తి స్పష్టతతో ఉన్నానని, ఒకవేళ తాను ఔటైనా తమ ప్రణాళిక అమలు చేయాలని అనుకున్నామని వివరించారు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉండటం తమలో ఆత్మవిశ్వాసాన్న నింపిందని రోహిత్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

తర్వాతి కథనం
Show comments