2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌కు ముందు క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ధోనీకి అభిమానులు, మద్దతుదారుల నుండి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) శిక్షణా శిబిరంలో ధోనీ పాల్గొనబోతున్నాడు.
ఈ శిబిరం రాబోయే సీజన్ కోసం ధోనీ సన్నాహకంగా ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభిస్తాడని తెలుస్తోంది. అనేక మంది ఇతర ఆటగాళ్ళు కూడా ఈ శిబిరంలో చేరే అవకాశం ఉంది. ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22, 2025న ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్‌ను మార్చి 23, 2025న ఆడనుంది.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, గత సంవత్సరం, ధోని కెప్టెన్సీ నుండి తప్పించి.. యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించాడు.