చెపాక్ స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్న మాజీ కెప్టెన్!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (13:24 IST)
మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. ఈయన ప్రస్తుతం చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్నారు. ధోనీ ఏంటి క్రికెట్ జట్టుకు రంగులు వేయడం అనే కదా మీ సందేహం... అయితే ఈ కథనం చదవండి. ఐపీఎల్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నెల 31వ తేదీన ప్రాంభమవుతుంది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. 
 
ఇందుకోసం చెపాక్ స్టేడియంలో గత నెల రోజులుగా ధోనీ ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సీఎస్కే క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. రేయింబవుళ్లు ప్రాక్టీస్ చేస్తూ, స్టేడియానికి మరమ్మతులు చేసే పనుల్లో కూడా నిమగ్నమయ్యారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత కొన్ని స్టాండ్లను కూడా ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనున్నారు.
 
ఈ క్రమంలో స్టాండ్స్‌లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

తర్వాతి కథనం
Show comments