Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్యాయాల‌ను ప్ర‌శ్నించే ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా గీత సాక్షిగా

Advertiesment
geeta sakshiga
, మంగళవారం, 14 మార్చి 2023 (15:19 IST)
geeta sakshiga
లేడీస్ హాస్టల్‌లో అమ్మాయిని ఎవ‌రో హ‌త్య చేస్తారు..హంత‌కుడిగా ఓ యువ‌కుడి (ఆద‌ర్శ్‌)ని పోలీస్‌లు అరెస్ట్ చేస్తారు..హ‌త్యానేరం ఒప్పుకోని యువ‌కుడిని పోలీసులు ఒప్పించ‌టానికి టార్చ‌ర్ పెడుతుంటారు. అత‌ని త‌ర‌పున లాయ‌ర్ల వాదించ‌టానికి కేసుని కూడా తీసుకోరు. ఆ స‌మ‌యంలో ఓ లేడీ లాయ‌ర్ (చిత్ర శుక్ల‌) కేసుని టేక‌ప్ చేసి అత‌ని త‌ర‌పున నిలుచుకుంటుంది. 
 
అస‌లు లేడీస్ హాస్ట్‌లో హ‌త్య జ‌రగ‌టం, అందులో యువ‌కుడు అరెస్ట్ కావ‌టం, అత‌న్ని పోలీసులు టార్చ‌ర్ పెట్టటం ఎంట‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘గీత సాక్షిగా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు అంథోని మట్టిపల్లి, నిర్మాత చేతన్ రాజ్. ‘గీత సాక్షిగా’ చిత్రాన్ని ఆంథోని మ‌ట్టిప‌ల్లి స్క్రీన్‌ప్లే రాసుకుని చ‌క్క‌గా తెర‌కెక్కించారు. చేత‌న్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై చేత‌న్ రాజ్ ఈ సినిమాను నిర్మించ‌ట‌మే కాకుండా.. స్టోరి కూడా రాశారు. పుష్ప‌క్‌, JBHRNKL స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. 
 
నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా  హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. మంగ‌ళ‌వారం ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతూ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. 
 
ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌శ్నించేలా ఉంది. అందులో హీరో ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్క‌వటం, అత‌నికి శిక్ష విధించాలంటూ మ‌హిళా సంఘాలు పోరాటం చేసే స‌న్నివేశాల‌తో పాటు.. చేయ‌ని త‌ప్పుకు అన్యాయంగా కేసులో ఇరుక్కున్న హీరో ఆద‌ర్శ్ తిర‌గ‌బ‌డే స‌న్నివేశాలు చూడొచ్చు. హీరో ఆద‌ర్శ్ లుక్, స్టైల్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. మార్చి 22న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటార‌న‌టంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో చ‌రిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా క‌థాంశం తిరుగుతుంటుందని మేకర్స్ తెలియ‌జేశారు. 
 
ఇంకా ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌, రూపేష్ శెట్టి, చ‌రిష్మా, భ‌ర‌ణి శంక‌ర్‌, జ‌య‌ల‌లిత‌, అనితా చౌద‌రి, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 
 
వెంక‌ట్ హ‌నుమ‌ నారిశెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి  కిషోర్ మ‌ద్దాలి ఎడిట‌ర్‌. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్కార్ వెళ్ళినా పోర్టబుల్ ఆలయాన్ని వదల్లేదు.. చెర్రీ దంపతులకు కితాబు