పెద్ద సినిమాకు హీరో, బేనర్ వాల్యూస్ వుంటాయి. వాటికి మీడియా రాసే రివ్యూస్‌కూ కలెక్షన్‌కూ తేడా వుంటుంది. అది బాగోలేదని రాసినా పెద్దగా పోయేదేమి వుండదు. స్టార్ స్టామినాపై ఆధారపడి వుంటుంది. కానీ చిన్న సినిమాకు ప్రమోషన్ బాగా చేయాలి. అందుకే బలగం అనే చిన్న సినిమాకు 20రోజులుగా ప్రమోషన్ చేస్తూనే వున్నాను అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఆయన జిమార్తెలు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలు. ప్రియదర్శి, కావ్యా జంటగా నటించారు. వేణు ఎల్ధండి దర్శకుడు.
10 రోజులుగా ఫ్రీగా షోలు ఆంధ్ర, తెలంగాణలో కొన్ని వేశాం. ఎందుకంటే చిన్న సినిమాకు థియేటర్ వరకు ఆడియన్స్ రప్పించాలనే తాపత్రయం. అంత టైం కేటాయించి ప్రమోషన్ చేస్తేనే విడుదలరోజు 25 శాతం ఆడియన్స్ వచ్చారు. ఆ తర్వాత 75 శాతం వచ్చారు. అదికూడా 20 రోజులుగా ఈ సినిమాకోసం కేటాయించాను. దాని వల్ల నేను చాలా సినిమాలు తీస్తున్నాను. దాని పనులన్నీ వెనకబడి పోయాయి అని అన్నారు.
బలగం అనే సినిమా తెలంగాణ మారు మూల ప్రాంతంలో వున్న కల్చర్. ఇది తెలంగాణా ప్రాంత కథ. ఆంధ్రకూ కనెక్ట్ అవుతుంది. చనిపోయిన వ్యక్తి కుటుంబంలో 10రోజుల తర్వాత ఏమి జరుగుతుంది. ఇంటి సభ్యులు ఏవిధంగా ఆ కార్యక్రమాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి వాతావరణ వుంటుందనేది ఈ సినిమా కథ.