Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ - వరుసగా రెండో విజయం

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (07:41 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా, బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఇది ఆ జట్టుకు వరుసగా రెండో విజయం. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. పంబాజ్ నిర్ధేశించిన 198 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరివరకు పోరాడిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులకే పరిమితమైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలుపును సొంతం చేసుకుంది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టులో ఓపెనర్లు ప్రభు సిమ్రన్, కెప్టెన్ శిఖర్ ధావన్‌లు మంచి శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌‍కు 90 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ప్రభు సిమన్ 34 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేయగా, ధావన్ 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 86 రన్స్ చేశాడు. జితేశ్ శర్మ 27, షారూక్ ఖాన్ 11 చొప్పున పరుుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీశాడు. 
 
ఆ తర్వాత 198 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. 192 పరుగులు చేసి ఓటమిపాలైంది. మ్యాచ్ ఆఖరులో షిమ్ర్ హెట్మెయిర్, ధ్రువ్ జురెల్‌లు చెలరేగినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. షిమ్రన్ 18 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్స్‌లు బాది 36 రన్స్, ధ్రువ్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌‌ల సాయంతో 32 పరుగులు చేశారు.
 
చివరి ఓవర్‌లో గెలుపునకు 16 పరుగులు కావాల్సిన తరుణంలో హెట్మెయిల్ వికెట్‌ను కోల్పోయి 10 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ సంజు శాంసన్ 42, దేవదత్ పడిక్కల్ 21, రియాన్ పరాగ్ 20 చొప్పున పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments