Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌లో సందడి చేసిన రిషబ్ పంత్

Advertiesment
rishabh panth
, బుధవారం, 5 ఏప్రియల్ 2023 (09:58 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌లో భారత క్రికెటర్ రిషబ్ పంత్ సందడి చేశాడు. గత యేడాది ఆఖరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం కొంతమేరకు కోలుకున్నారు. ముఖ్యంగా ఆయన మోకాలికి ఆపరేషన్ చేయడంతో నిరవధికంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో సందడి చేశారు. 
 
మంగళవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ - గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన ఊతకర్ర సాయంతో ఆడియన్స్ గ్యాలెరీలో కనిపించారు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూర్చునే గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ ఢిల్లీ కెప్టెన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో డీసీ జట్టు డగౌట్లో అతడి జెర్సీని ప్రదర్శించడం తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. 
 
రిషబ్‌ జెర్సీని ఇలా డగౌట్లో ఉంచొద్దని ఢిల్లీ ఫ్రాంఛైజీకి బీసీసీఐ సూచించినట్లు తెలిసింది. 'డగౌట్‌పై పంత్‌ జెర్సీని వేలాడదీయడం బాగోలేదు. ఏదైనా విషాదం లేదా రిటైర్‌మెంట్‌ సమయంలోనే ఇలాంటివి చూస్తాం. పంత్‌ క్షేమంగా ఉన్నాడు. ఊహించి దానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఒక మంచి ఆలోచనతోనే ఢిల్లీ ఈ పని చేసినా.. ఇలాంటి చర్యలు మానుకోవాలని' బీసీసీఐ సూచించింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన శ్రేయాస్ అయ్యర్