గుజరాత్ టైటాన్స్‌తో ఐపీఎల్-16 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 170 పరుగుల వరకు స్కోరు సాధిస్తుందని నందమూరి హీరో బాలకృష్ణ అంచనా వేశారు. ఈయన అంచనా వేసిన పరంగా జరిగింది. మ్యాచ్ ముగియగానే స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ ప్రజెంటర్ వింధ్య విశాఖ ఈ విషయాన్ని బాలకృష్ణ వద్ద ప్రస్తావించింది.
బాలయ్య చెప్పిందే నిజమైందని వింధ్య విశాఖ తెలిపింది. అందుకు సమాధానంగా బాలయ్య నుంచి చిరునవ్వు వెలువడింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 రాబోయే సీజన్ కోసం తమ కొత్త గీతాన్ని గుజరాత్ టైటాన్స్ (GT)తో తమ మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ధోనీ వయసు నిన్నటికి 41 సంవత్సరాల 267 రోజులు.
ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్ రికార్డు ఇప్పటి వరకు దివంగత ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ పేరున ఉంది. వార్న్ 41 సంవత్సరాల 249 రోజుల వయసులో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథ్యం వహించాడు.