Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తుగా ఓడిన బెంగుళూరు - అగ్రస్థానంలో రాజస్థాన్

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (07:29 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో తన ఖాతాలో మరో ఓటమిని వేసుకుంది. అదేసమయంలో ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 
 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది. బెంగుళూరు బౌలర్లు రాణించడంతో పరుగులు రావడం గగనమైంది. దీనికితోడు వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫలితంగా ఈ జట్టు ఆటగాళ్లలో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు రెండు అంకెల స్కోరు చేయలేక పోయారు. 
 
అయితే, రియాన్ ఫరాగ్ క్రీజులో పాతుకునిపోవడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. పరాగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంత్రో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్ 17, శాంసన్ 27, డరిల్ మిచెల్ 16 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగన బెంగుళూరు జట్టు షరా మామూలుగానే పేలవ ప్రదర్శనతో ఆటను మొదలుపెట్టింది. విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత నుంచి వికెట్ల పతనం కొనసాగింది. 37 పరుగుల వద్ద డుప్లెసిస్ (23), మ్యాక్స్‌వెల్ (0) ఔట్ అయ్యారు. 
 
రాజస్థాన్ బౌలర్లలో ముఖ్యంగా, కుల్దీప్ సేన్, అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా బెంగుళూరు ఆటగాళ్లు వరుసబెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. దినేష్ కార్తీక్ 6, షాబాజ్ అహ్మద్ 17, హసరంగ 18 చొప్పున పరుగులు చేశారు. 
 
గత మ్యాచ్‌లో 68 పరుగులకే కుప్పకూలి ఘోర వైఫల్యానని మూటగట్టుకున్న రాయల్ చాలెంజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శనతో ఓమటి పాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments