Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను గదిలో వాడుకున్నాడు చమ్మక్ చంద్ర: స్వాతి నాయుడు తీవ్ర ఆరోపణ, కొరడాతో కొట్టుకుంటాడా?

Advertiesment
swathi naidu
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:46 IST)
జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర స్కిట్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు.... ఆ స్కిట్లతో పాటు ఆమధ్య ఎఫ్2 చిత్రంలో కొరడాతో కొట్టుకుంటూ భలే నవ్వించాడు. జబర్దస్త్ ఒక ఎత్తయితే సినిమాల్లో చమ్మక్ చంద్ర మేనరిజమ్ మరో ఇత్తు.

 
ఇక అసలు విషయానికి వస్తే.. చమ్మక్ చంద్రపై యూ ట్యూబ్ శృంగార తార తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు జబర్దస్త్ షోలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చమ్మక్ చంద్ర తనను గదికి తీసుకుని వెళ్లి వాడుకున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. వాడుకున్నాక తనకు అవకాశం ఏదీ అంటే... ఫోన్ కట్ చేసాడని ఆరోపించింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో ఆడవాళ్లకి అవకాశాలు కష్టమని చెప్పాడనీ, అలాగైతే తన సోదరుడికి ఛాన్స్ ఇప్పించమంటే తప్పించుకు తిరిగాడని చెప్పుకొచ్చింది.

 
చివరికి తను పోలీసు స్టేషనులో కేసు పెడితే.. అక్కడ కూడా తనను నోటికొచ్చినట్లు మాట్లాడాడని అంది. ఇలాంటి వెధవలు తన జీవితంలో చాలామంది వున్నారనీ, వాడుకుని వదిలేయడం వారికి అలవాటు అంటూ చెప్పింది. నాలా చమ్మక్ చంద్ర చేతిలో మోసపోయినవాళ్లు చాలామంది వున్నారనీ, కానీ వారందరూ భయపడి ముందుకు రావడం లేదని వెల్లడించింది. తనకు మటుకు ఎలాంటి భయం లేదనీ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ల చేతుల్లో మోసపోకుండా వుంటారని తనకు జరిగిన అన్యాయాన్ని చెపుతున్నానంటూ వెల్లడించింది స్వాతి నాయుడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకుల వ్యవహారంపై సుమ రాజీవ్ కనకాల ఏమన్నారు?