Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిఖర్ ధవాన్ సూపర్బ్ ఇన్నింగ్స్ - చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు

Advertiesment
punjab team
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (07:32 IST)
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఇది సీఎస్కే జట్టు ఆరో పరాజయం. పంజాబ్ జట్టు ఆటగాడు శిఖర్ ధవాన్ సూపర్బ్ ఇన్నింగ్స్ దెబ్బకు ధోనీ సేన తలవంచింది. దీంతో చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ధావన్ మరోమారు మారు చెలరేగి 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసింది. భానుక రాజపక్స 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశారు. మయాంక్ 18, లివింగ్‌ స్టోన్ 19 చొప్పున పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో బ్రావోకు రెండు వికెట్లు తీశాడు. 
 
ఆ తర్వాత 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈసారి కూడా ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. పది పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో ఓపెనర్ ఊతప్ప (1), శాంట్నర్ (9) వికెట్లను కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. 
 
అయితే, అంబటి రాయుుడు క్రీజ్‌లో పాతుకుపోయి ఒక దశలో పంజాబ్ బౌర్లకు దడ పుట్టించాడు. ఆయన క్రీజ్‌లో ఉన్నంత సేపు జట్టు విజయం దిశగానే పయనించింది. 39 బంతుల్లో ఏడు ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసిన రాయుడు అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 27 పరుగులు కావాల్సివుంటగా, క్రీజ్‌లో ఉన్న ధోనీ తొలి బంతిని సిక్సర్‌గా మరల్చడంతో మళ్లీ మ్యాజ్ చేస్తాడని అనిపించింది. 
 
కానీ, మూడో బంతికి పెవిలియన్ చేరడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమి ఖాయమైంది. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 21 పరుగులతో నాటౌట్‌గా నిలువగా, ఓపెనర్ రుతురాజ్ 30 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబడ, రిషి, ధావన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లాక్ చికెన్ వ్యాపారంలోకి ధోనీ.. 2వేల కోడిపిల్లల్ని ఆర్డర్ చేశాడోచ్! (video)