Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 ఐపీఎల్‌.. చెన్నై జట్టుకు ధోనీనే కెప్టెన్.. చెప్పిందెవరంటే?

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (10:57 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో ధీటుగా రాణించలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. చెన్నై క్రికెటర్లు కూడా రాణించలేకపోవడంతో ఆ జట్టు కూడా ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండిపోయింది. దీంతో వచ్చే ఎంఎస్ ధోనీని సీఎస్కే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎక్కేకు కొత్త కెప్టెన్ వస్తారని నెటిజన్లు పలు పోస్టులు చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
 
ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీనే కొనసాగనున్నట్లు ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయంగా, ఐపీఎల్‌లోనూ విజయవంతమైన కెప్టెన్ ధోనీ అని ప్రశంసించారు. ధోనీపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయితే ప్రస్తుత సీజన్‌లో సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం డ్వేన్ బ్రావో గాయపడటం చెన్నై జట్టుకు ప్రతికూల ఫలితాలు వచ్చేలా చేసిందన్నారు.
 
ధోనీ బ్యాటింగ్‌పై సైతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సైతం సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఐపీఎల్‌లో ధోనీ అత్యంత విలువైన ఆటగాడని, ఫ్రాంచైజీకి కలిసిరాని ఒక్క ఏడాది ధోనీలాంటి ఆటగాడి సామర్థ్యాన్ని నిర్ణయించలేదు. సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. లీగ్‌ చరిత్రలో చెన్నైకి ఉన్న రికార్డు మరే జట్టుకూ లేదని' సీఎస్కే గురించి, కెప్టెన్ ధోనీ గురించి విశ్వనాథన్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments