Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బ్యాట్ పట్టిన హిట్ మ్యాన్ : ముమ్మరంగా ప్రాక్టీస్!

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (15:54 IST)
ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టుకు 'హిట్ మ్యాన్‌'గా పేరుగాంచిన రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. అయితే, ఇటీవల తొడకండరాలు పట్టేయడంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈ గాయన నుంచి కోలుకున్న రోహిత్.. తిరిగి బ్యాట్ పట్టుకున్నాడు. 
 
సోమవారం రాత్రి ముంబై ప్రాక్టీస్‌ సెషన్‌లో నెట్స్‌లో సాధన చేశాడు. అబుదాబి వేదికగా బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ప్రస్తుతం రోహిత్‌ గాయం తీవ్రతపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ.. ప్లేఆఫ్‌ బెర్తు లేదా టేబుల్‌ టాపర్‌గా నిలువాలని ముంబై పట్టుదలతో ఉంది. అందుకే బెంగళూరుతో మ్యాచ్‌ ఆడేందుకు రోహిత్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
కాగా, ముంబై జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, బెంగళూరు జట్లు కూడా 14 పాయింట్లతో ఉన్నాయి. గత కొద్దిరోజులుగా పంజాబ్‌తో పాటు కొన్ని జట్లు అనూహ్య ప్రదర్శన చేస్తుండటంతో ప్లే బెర్తుకు పోటీ పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments