Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ : కోల్‌కతాకు చుక్కలు.. సన్‌రైజర్స్‌ మూడో గెలుపు

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ విలియమ్సన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివర్లో యూసుఫ్ పఠాన్ స

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (16:31 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ విలియమ్సన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివర్లో యూసుఫ్ పఠాన్ సిక్స్ బాదగా.. ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ తొలి విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ పవర్ ప్లే ముగిసేలోగానే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 
 
అయితే విలియమ్సన్ (50), షకీబుల్ హసన్ (27) రాణించడంతో హైదరాబాద్‌కు గెలుపు సులువైంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఓపెనర్ క్రిస్ లిన్ (34 బంతుల్లో 49) ధాటిగా ఆడగా.. కెప్టెన్ దినేష్ కార్తీక్ (29), నితీష్ రాణా (18) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో సన్ రైజర్స్ చేతిలో కోల్ కతా పరాజయం పాలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments