Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఇండోర్‌లో మూడో వన్డే... తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆదివారం కీలకమైన మూడో వన్డేకు ఇండోర్ సిద్ధమైంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తుండగా, రెండు

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (11:06 IST)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆదివారం కీలకమైన మూడో వన్డేకు ఇండోర్ సిద్ధమైంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తుండగా, రెండు వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయిన ఆస్ట్రేలియా, ఈ మ్యాచ్ గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. 
 
అయితే, బౌలింగ్‌పరంగా బాగా కనిపిస్తున్న టీమిండియా, బ్యాటింగ్‌లోనే పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటివరకూ సిరీస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ఏ ఆటగాడూ చూపలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇంతవరకూ ఫామ్‌లోకి రాలేదు. మనీష్ పాండే సైతం తన దూకుడును చూపడంలో విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 
 
ఇక పర్యాటక ఆస్ట్రేలియా విషయానికి వస్తే, స్పిన్నర్లు చాహల్, కుల్ దీప్‌లను అడ్డుకోలేకపోతుండటం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్ భారం స్మిత్, వార్నర్‌లపై మాత్రమే పడుతోంది. వీరిద్దరూ అవుట్ అయితే, ఆస్ట్రేలియా విజయం సాధించడం క్లిష్టతరమవుతోంది.
 
ఇక ఇండోర్ మైదానం చిన్నది కావడంతో, పరుగుల వరద ఖాయమని, 300కు పైగా స్కోర్ నమోదైనా, దాన్ని సులువుగా అందుకోవచ్చని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పులేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments