Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ పైన అణ్వాయుధాల ప్రయోగిస్తామన్న పాక్... చైనా మారిపోయింది...

అణ్వాయుధాల దాడి అంటే... ఇక మానవ సమాజానికి తల కొరివి పెట్టుకుంటున్నట్లే లెక్క. ఈ మాట ఎవరన్నా... ఏ దేశం అన్నాసరే ప్రపంచంలోని మిగిలిన దేశాలు మండిపడతాయి. ఎందుకంటే అణ్వాయుధ దాడి తర్వాత పరిస్థితి ఏమిటన్నది వాటికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి

Advertiesment
భారత్ పైన అణ్వాయుధాల ప్రయోగిస్తామన్న పాక్... చైనా మారిపోయింది...
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (21:01 IST)
అణ్వాయుధాల దాడి అంటే... ఇక మానవ సమాజానికి తల కొరివి పెట్టుకుంటున్నట్లే లెక్క. ఈ మాట ఎవరన్నా... ఏ దేశం అన్నాసరే ప్రపంచంలోని మిగిలిన దేశాలు మండిపడతాయి. ఎందుకంటే అణ్వాయుధ దాడి తర్వాత పరిస్థితి ఏమిటన్నది వాటికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రసంగం చేసే ముందు విలేకర్లతో మాట్లాడుతూ... భారతదేశం పైన అవసరమైతే స్వల్ప లక్ష్య అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరిక లాంటిది చేశారు. 
 
దీనితో చైనాకు చిర్రెత్తుకొచ్చింది. పిచ్చోడి చేతిలో రాయిలా ఎవరు పడితే వారు అణు ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పడంపై పాకిస్తాన్ చెప్పడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాశ్మీర్ అంశంలో తాము జోక్యం చేసుకోబోమనీ, భారత్-పాక్ తేల్చుకోవాల్సిందేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. పైగా తాము భారతదేశంతో కలిసి అభివృద్ధి పథంలో కలిసి నడిచేందుకు ఆసక్తిగా వున్నామనీ, భద్రత విషయంలోనూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతామని చైనా కాన్సుల్ జనరల్ మా ఝన్వు వ్యాఖ్యానించారు. 
 
రెండు దేశాల మధ్య స‌త్సంబంధాలు మ‌రింత మెరుగుప‌ర్చుకునేందుకు అనుసరించవలసిన విధానాలపై భార‌త‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, త‌మ దేశ‌ అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్ సెప్టెంబరు 5న చర్చలు జరిపినట్లు చెప్పుకొచ్చారు. అందువల్ల తాము ఆ మార్గంలోనే నడుస్తామనీ, డోక్లాం విషయాన్ని తాము ఇప్పుడు పట్టించుకునే స్థితిలో లేమని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత అపోలోలో ఇడ్లీ సాంబార్ తిన్నారు.. పేపర్ చదువుతున్నారు.. ఇవన్నీ అబద్ధాలే: శ్రీనివాసన్