Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్ సమస్యపై చైనా ఏమన్నదో తెలుసా? పాకిస్థాన్‌కు వంత పాడింది..

ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ సమస్యను చైనా లేవనెత్తింది. ఈ సందర్భంగా భారత్‌పై విద్వేషాన్ని, పాకిస్థాన్‌పై ప్రేమను మరోసారి ప్రదర్శించింది. కాశ్మీర్ అంశంపై అలసత్వం పనికిరాదని.. ఈ వివాదానికి ముగింపు పలకాల్సి

Advertiesment
కాశ్మీర్ సమస్యపై చైనా ఏమన్నదో తెలుసా? పాకిస్థాన్‌కు వంత పాడింది..
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (12:11 IST)
ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ సమస్యను చైనా లేవనెత్తింది. ఈ సందర్భంగా భారత్‌పై విద్వేషాన్ని, పాకిస్థాన్‌పై ప్రేమను మరోసారి ప్రదర్శించింది. కాశ్మీర్ అంశంపై అలసత్వం పనికిరాదని.. ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లె కాంగ్ చెప్పారు. 
 
కాశ్మీర్ వివాదం విషయంలో చైనాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉందని చెప్పారు. 20 నిమిషాల పాటు కొనసాగిన తన ప్రసంగంలో... జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకున్న హింసకు సంబంధించి విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
 
కాశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్-పాకిస్థాన్ పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేగాకుండా ఐక్యరాజ్యసమితి తరపున మానవహక్కుల కమిషన్‌ను కాశ్మీర్‌కు పంపాలని.. అక్కడ భారత్ చేస్తున్న మానవ హక్కుల అణచివేతను గుర్తించాలని లె కాంగ్ తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని... దారుణాలకు పాల్పడినవారిని శిక్షించాలని అన్నారు.
 
ఇదిలా ఉంటే.. ఉగ్రవాదాన్ని నియంత్రించటంలో విఫలమైన పాకిస్థాన్‌ ప్రపంచదేశాలకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పటం విడ్డూరంగా ఉందని ఐక్యరాజ్య సమితిలో భారత్ కార్యదర్శి ఈనామ్‌ గంభీర్‌ తెలిపారు. శుక్రవారం జనరల్‌ అసెంబ్లీలో ప్రసగించిన ఆమె పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ ఇప్పుడు టెర్రరిస్థాన్‌‌గా మారిపోయిందని, అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని దుయ్యబట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి పేరుతో మోసం : నర్సింగ్ విద్యార్థినితో వైద్య విద్యార్థి సహజీవనం