వెస్టిండీస్‌తో తొలి టెస్టు: 50 వికెట్లతో బుమ్రా.. సెంచరీతో కేఎల్ రాహుల్ రికార్డులు

సెల్వి
శుక్రవారం, 3 అక్టోబరు 2025 (15:30 IST)
Team India
వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా బుమ్రా రికార్డ్ సృష్టించాడు. టెస్ట్‌ల్లో సొంతగడ్డపై అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా జవగళ్ శ్రీనాథ్‌తో సమంగా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలో అతను కపిల్ దేవ్ రికార్డ్‌ను అధిగమించాడు.
 
బుమ్రా, జవగళ్ శ్రీనాథ్ 24 ఇన్నింగ్స్‌ల్లో సొంతగడ్డపై 50 టెస్ట్ వికెట్లు సాధించారు. కపిల్ దేవ్ 25 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే సొంతగడ్డపై బుమ్రాదే అత్యుత్తమ యావరేజ్ కావడం విశేషం. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో 200 వికెట్ల మైలురాయి అందుకునేందుకు బుమ్రా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతను 173 వికెట్లతో నిలిచాడు. డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌లో అతను ఈ మైలురాయి అందుకునే అవకాశం ఉంది.
 
మ్యాచ్ సంగతికి వస్తే.. 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
 
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ రెండు సెషన్లలోనే ముగిసింది. 
 
అలాగే అహ్మదాబాద్ టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 6 బౌండరీలతో 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆటలోనూ అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్, తన కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
 
ఇంకా ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌లో నిలకడగా రాణించడం ద్వారా 2025లో టెస్ట్ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ డకెట్‌ను వెనక్కి నెట్టేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. చంద్రబాబు

చొక్కాపై చట్నీ వేసాడని అర్థరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లుతో కాల్చుతూ కత్తితో పొడిచి చంపేసారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Monalisa : కుంభమేళా భామ మోనాలిసా కథానాయికగా లైఫ్ చిత్రం ప్రారంభం

Nagarjuna: డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో శివ రీరిలీజ్ - చిరంజీవిలా చిరస్మరణీయం : వర్మ

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

తర్వాతి కథనం
Show comments