బ్రియాన్ లారా వంటి వారే ఏమీ చేయలేకపోయారు.. మేం ఎంత మాత్రం?

విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్‌ (40) ఫిట్‌గా ఉంటే 2019లో జరిగే వరల్డ్‌క్‌పలో కచ్చితంగా ఆడతాడని జట్టు సారథి జాసన్‌ హోల్డర్‌ తెలిపాడు. గేల్‌తో పాటు మార్లోన్‌ శామ్యూల్స్‌ కూడా మెగా టోర్నీలో ఆడే అవ

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (12:09 IST)
విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్‌ (40) ఫిట్‌గా ఉంటే 2019లో జరిగే వరల్డ్‌క్‌పలో కచ్చితంగా ఆడతాడని జట్టు సారథి జాసన్‌ హోల్డర్‌ తెలిపాడు. గేల్‌తో పాటు మార్లోన్‌ శామ్యూల్స్‌ కూడా మెగా టోర్నీలో ఆడే అవకాశముందని హోల్డర్‌ చెప్పాడు. అలాగే భారత్‌ చేతిలో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌‌పై మాజీ క్రికెటర్లు చేస్తున్న విమర్శలను హోల్డర్ తిప్పికొట్టాడు. 
 
బ్రియాన్‌ లారా వంటి దిగ్గజాలతో కూడిన జట్టే 1994లో భారత్‌తో ఆడిన టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయిందని గుర్తు చేశారు. ఇంకా అప్పట్లో డ్రాతో సరిపుచ్చుకుందని హోల్డర్ గుర్తు చేశారు. ఆ జట్టుతో పోల్చుకుంటే ప్రస్తుత కరేబియన్ జట్టుకున్న అనుభవం చాలా తక్కువంటూ వ్యాఖ్యానించాడు. 
 
అయినప్పటికీ తాము ఆడిన చివరి ఐదు టెస్టు సిరీస్‌లలో పెద్ద జట్లపై కూడా నెగ్గామన్నాడు. మాజీలు విమర్శిస్తున్నట్టుగా విండీస్‌ టెస్టు జట్టు మరీ బలహీనంగా ఏమి లేదని హోల్డర్‌ తెలిపాడు. 
 
ఇదిలా ఉంటే.. భారత్‌ -విండీస్ టెస్టు మ్యాచ్‌కు ఉప్పల్‌ సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్ల క్రికెటర్లు హైదరబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
మరోవైపు అంతర్జాతీయ క్రికెటర్లు నగరానికి చేరిన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఉప్పల్‌లో టీమిండియా ట్రాక్‌ రికార్డు చూస్తే.. విండీస్‌‌ విలవిలలాడం ఖాయమంటున్నారు క్రికెట్‌ అభిమానులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments