Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు లంకతో రెండో టీ20 ... సిరీస్‌పై కన్నేసిన భారత్

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శుక్రవారం ఇండోర్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. ముచ్చటగా మూడో (పొట్టి ఫార్

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (10:20 IST)
మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శుక్రవారం ఇండోర్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. ముచ్చటగా మూడో (పొట్టి ఫార్మాట్) సిరీస్‌నూ చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. అయితే అది ఇండోర్‌లోనే చేజిక్కించుకుంటారా..? మూడో మ్యాచ్ వరకు ఆగుతారా..? అన్నది ఆసక్తికరం..!
 
ఈ యేడాది ఆఖరులో భారత్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో ఆలోపే అన్ని అంశాలను సరిచూసుకోవాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. కానీ లంక కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో టీంమిండియా సన్నాహకాలు చప్పగా సాగుతున్నాయి. మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా సాగుతుండటంతో భారత్ బలహీనతలు బయటకు రావడం లేదు. రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించే అవకాశం కూడా లభించడం లేదు.
 
అయితే, సిరీస్‌పై భారత్ దృష్టిపెట్టినా చివరి రెండు మ్యాచ్‌లకు రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో పేసర్ బాసిల్ థంపి, హిట్టర్ దీపక్ హుడాకు అవకాశం దక్కొచ్చు. ఓపెనింగ్‌లో లోకేశ్ మెరిసినా.. రోహిత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో దానిని పూర్తి చేస్తాడో చూడాలి. ఇక జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్, మనీష్ అంచనాలను మించి ఆడటం భారత్‌కు కలిసొచ్చే అంశం. 
 
టీ20 స్పెషలిస్ట్‌గా పేరుబడిన దినేశ్ కార్తీక్ చెలరేగాల్సి ఉంది. సీనియర్ ధోనీ తనలో సత్తా తగ్గలేదని చాటిచెప్పడం అత్యంత అనుకూలాంశం. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు భారీ స్కోరు అందించిన తీరును ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే. బౌలింగ్‌లో బుమ్రాకు తిరుగులేదు. ఉనాద్కట్‌కు ఈ మ్యాచ్‌లో చోటు కష్టమే. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. రెండో మ్యాచ్‌లోనూ వీరందరు సమిష్టిగా చెలరేగితే సిరీస్ గెలువడం నల్లేరుమీద నడకే.
 
వరుస సిరీస్ పరాజయాల నేపథ్యంలో లంక జట్టులో ఆత్మవిశ్వాసం అడుగంటింది. జట్టులో ఉన్న సీనియర్లు... భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లపై కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నారు. దీంతో అనుభవం లేని కుర్రాళ్లు కూడా ఇదే తీరును అనుసరిస్తున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా లంక పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. 
 
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, శ్రేయాస్, కార్తీక్, పాండే, ధోనీ, పాండ్యా, కుల్దీప్, చాహల్, థంపి, బుమ్రా.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), డిక్వెల్లా, తరంగ, కుశాల్, మాథ్యూస్, సమరవిక్రమ, గుణరత్నే, శనక, ధనంజయ, చమీరా, ప్రదీప్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments