Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఆస్కార్‌'కు నామినేట్ అయిన మెగాస్టార్ పాటలు

ప్రతి ఒక్కరికీ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవాలనే కల ఉంటుంది. అయితే, దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఈ కల కలగానే మిగిలిపోతోంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ మాత్రం ఈ కలను నెరవేర్చుకున్నార

'ఆస్కార్‌'కు నామినేట్ అయిన మెగాస్టార్ పాటలు
, బుధవారం, 20 డిశెంబరు 2017 (09:44 IST)
ప్రతి ఒక్కరికీ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవాలనే కల ఉంటుంది. అయితే, దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఈ కల కలగానే మిగిలిపోతోంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ మాత్రం ఈ కలను నెరవేర్చుకున్నారు.
 
ఈ నేపథ్యంలో మెగాస్టార్ నటించిన ఓ చిత్రంలోని పాటలు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాయి. అయితే, ఆ మెగాస్టార్ చిరంజీవి కాదు. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్. ఈయన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ పులిమురుగన్ (మన్యంపులి). జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వైశాఖ దర్శకత్వం వహించాడు.
 
దసరాకి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. ఈ చిత్రం తెలుగులోను 'మన్యంపులి' టైటిల్‌తో విడుదలై మంచి విజయం అందుకుంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో 3డీ, 6డీ ఫార్మాట్‌లోను చిత్రాన్ని విడుదల చేశారు. 6డీ వెర్షన్లో విడుదలైన తొలి భారతదేశ సినిమా కూడా ఇదే కావడం విశేషం. 
 
ఈనేపథ్యంలో మన్యంపులి మలయాళ వెర్షన్ రూ.వంద కోట్లకి పైగా వసూళ్ళు సాధించడంతో పాటు పలు అవార్డులను దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా మోహన్ లాల్ అందుకున్నారు. పీటర్ హెయిన్స్ బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. 
 
ఇక ఇప్పుడు ఈ చిత్రానికి మరో ఘనత దక్కింది. గోపి సుందర్ సంగీతంలో రూపొందిన 'కాదనయుం..', 'మానతే..' అనే రెండు పాటలు ఉత్తమ పాటల విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యాయి. దీంతో చిత్ర బృందం తెగ సంబరపడిపోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్కింటి అమ్మాయిని చూడరా..