'బాహుబలి'ని మించిన చిత్రాన్ని నిర్మించాలి.. ఏకమవుతున్న బాలీవుడ్
ఏప్రిల్ 28వ తేదీకి ముందు వరకు భాతీయ చలనచిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే. దేశంలో ఎన్నో ప్రాంతీయ భాషా చిత్రపరిశ్రమలు ఉన్నప్పటికీ.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముందు అవి దిగదుడుపుగానే ఉన్నాయి.
ఏప్రిల్ 28వ తేదీకి ముందు వరకు భాతీయ చలనచిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే. దేశంలో ఎన్నో ప్రాంతీయ భాషా చిత్రపరిశ్రమలు ఉన్నప్పటికీ.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముందు అవి దిగదుడుపుగానే ఉన్నాయి. కానీ ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన "బాహుబలి 2 : ది కంక్లూజన్" చిత్రంతో బాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకునిపోయాయి. ఒక ప్రాంతీయ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులను తిరగరాసింది. ఈ విజయాన్ని బాలీవుడ్ చిత్ర ప్రముఖులు జీర్ణించుకోలేక పోతున్నారు.
అందుకే 'బాహుబలి' విజయాన్ని తలదన్నేలా భారీ చిత్రాన్ని నిర్మించేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాతలంతా ఏకమవుతున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. దక్షిణాది చిత్రం అదీ ఓ ప్రాంతీయ భాషా చిత్రం తమ రికార్డులన్నీ చెరిపివేయడాన్ని వారు నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా.. బాలీవుడ్ సాధించలేని రికార్డులను ఓ ప్రాంతీయ భాషా చిత్రం సాధించడం వారిని తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. బాహుబలిని మించిన సినిమాను తీయాలని ఇప్పుడు అక్కడి దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
అయితే, జక్కన్న సినిమా కోలీవుడ్‌లో కూడా ఇలాంటి పరిస్థితినే నెలకొల్పింది. తమిళ దర్శకుడు చేరన్ చేసిన ట్వీట్ కోలీవుడ్ ప్రముఖుల మనసులోని ఆలోచనను ప్రతిబింభిస్తోంది. 'బాహుబలి-2'ను మించిన సినిమాను మనం కూడా నిర్మించాలని ట్విట్టర్ ద్వారా చేరన్ పిలుపునిచ్చాడు. దానికి తగ్గ ఎన్నో పౌరాణిక కథలు తమిళంలో కూడా ఉన్నాయన్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాతలతో పాటు.. దర్శకుడు చేరన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.