Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంబుల్లా వన్డే : శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన... ఇపుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా, ఆదివారం దంబుల్లాలో వేదికగా జరిగిన త

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (05:58 IST)
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన... ఇపుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా, ఆదివారం దంబుల్లాలో వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 216 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని బ్యాట్స్‌మెన్లు డిక్‌వెల్లా 64, గుణ‌తిల‌క 35, కుశ‌ల్ మెండిస్ 36, కెప్టెన్ త‌రంగ 13, మాథ్యూస్ 36, క‌పుగెదెర 1, డిసిల్వా 2 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు... 28.5 ఓవర్లలోనే 216 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించి 220 పరుగులతో విజయపరంపర కొనసాగించింది. ఓపెనర్ శిఖర్ ధవన్ 90 బంతుల్లో 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు. 
 
అలాగే, విరాట్ కోహ్లీ 70 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్), రోహిత్ శర్మ 4 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును శిఖర్ ధవన్ అందుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్ ప‌టేల్ 3, య‌జువేంద్ర చాహ‌ల్ 2, కేదార్ జాద‌వ్ 2 వికెట్లు తీసి లంకేయుల నడ్డి విరిచారు. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments